గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖలకు సహాయ మంత్రి కావడంపై కొందరు వైసీపీ సపోర్టర్లు సెటైర్లు వేస్తున్నారు. ‘25 ఏళ్లకు పైగా యూఎస్‌లో గడిపిన వ్యక్తి భారత్‌లో గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తాడట. భారత ప్రభుత్వంలో ఓ జోక్‌గా ఉంది’ అని ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు స్పందిస్తూ.. ‘16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి సీఎం అవ్వలేదా?’ అని కౌంటర్ ఇస్తున్నారు