‘మురారి’ చిత్రం రీ రిలీజ్‌పై హీరోయిన్ సోనాలి బింద్రే స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ‘‘మహేశ్‌తో మురారి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.. 23 ఏళ్ల తర్వాత కూడా మురారి సినిమాపై అదే ప్రేమ చూపించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని మాకు ఇంత ప్రత్యేకంగా మార్చిన డైరెక్టర్ కృష్ణ వంశీకి అభినందనలు’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ ‘మురారి’ రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద మహేశ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అభిమాన హీరో సినిమా 23 ఏళ్ల తర్వాత రావడంతో కోలాహలం సృష్టించారు. క్యాన్సర్‌ను జయించిన సోనాలి బింద్రే మళ్లీ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉంది.