రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కమలాపురం, చెన్నూరు పర్యటనలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా?. నేనెవరిని అనుకుంటున్నావు?. రాజన్న బిడ్డని గుర్తుపెట్టుకో!. అధికార మదం తలకు ఎక్కిందా?. మతి ఉండే మాట్లాడుతున్నావా?. నువ్వూ.. నీ కొడుకు పేమెంట్ తీసుకుని నన్ను.. సునీతను పలు విధాలుగా హింసించారు. సామాజిక మాధ్యమాల్లో హేళన చేశారు. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా?. మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా పెయిడ్ ఆర్టిస్ట్లేనా?.అంత పెద్ద మాటలు అనడానికి మాకు సంస్కారం’ ఉందంటూ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సజ్జలను సలహాదారుగా నియమించడం జగన్ చేసుకున్న ఖర్మంటూ షర్మిల వ్యాఖ్యానించారు.