అమరావతి, దీక్షమీడియా :
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… జాతీయస్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు ఈనెల 27,28 తేదీలలో విజయవాడ జింఖానా గ్రౌండ్ లో జరిగే మహా ధర్నాకు రైతులు,కార్మికులను సమాయత్తం చేసే నిమిత్తం ఈరోజు ఉదయం గన్నవరంలోని సి.పి.ఐ కార్యాలయంలో రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి గన్నవరం శాఖ కార్యవర్గ సమావేశం జిల్లా రైతు సంఘ అధ్యక్షులు ముక్కామల ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రైతు సంఘాల, ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కార్యవర్గ సభ్యులు,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాల అంశాలైన వ్యవసాయాన్ని,విద్యుత్ శక్తిని తమ ఆధీనంలోకి తీసుకొని వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించటానికి వీలుగా విద్యుత్ బిల్లు 2020ని తీసుకువచ్చిందని దీనికి అనుగుణంగా రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కేంద్రానికి సాగిలపడి ఉమ్మడి 13 జిల్లాల్లో మొత్తం 20 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మెంటల్ బిగించడానికి టెండర్లు పిలవటం చాలా దారుణమని ఈ విధానాన్ని కొనసాగిస్తే, గొట్టపు బావుల క్రింద రైతులు వ్యవ సాయం చేసుకోలేక, విద్యుత్ బిల్లులు కట్టలేక ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని, ఈ విధానాన్ని రద్దుచేసి పాత ఉచిత విద్యుత్ విధానాన్నే కొనసాగిం చాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వలన కేంద్రం తీసుకువచ్చిన కృష్ణా జలాల పునఃపంపిణీ గజెట్ అమలయితే శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం 255 టీఎంసీలు తో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు సక్రమ ప్రాజెక్టులుగా మారితే, శ్రీశైలం దిగువ భాగాన నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా,ఎస్.ఆర్.బీ.సీ కింద ఉన్న మొత్తం 30 లక్షల ఎకరాలకు చుక్క నీరు రాక బీడుగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీవ్ర పరిస్థితుల దృష్యా కేంద్రం తేచ్చిన ఈ గజెట్ ను రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిపిఐ నాయకులు పెద్దు వెంకటరత్నం, కే.ఆర్.సీ జోషి, పెద్దు వాసుదేవరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు చేటు చేసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి, కార్మికుల హక్కులు పునరుద్ధరించాలని,ఢల్లీిలో చారిత్రాత్మక కిసాన్ పోరాటం సందర్భంగా అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని పెండిరగ్లో ఉన్న కేసులు అన్ని ఉపసంహరించాలని,రైతులను అక్రమంగా కారుతో గుద్ధి చంపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ను అతని కుమారుడు అసిస్ మిశ్రా ను ప్రాసిక్యూట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దొంతు చిన్న, గన్నవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, జిల్లా సి.పి.ఎం నాయకులు కళ్ళెం వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ… రైతులు పండిరచిన ఆహార,వాణిజ్య, ఉద్యాన, సామాజిక,వన పంటలన్నిటికీ సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి ఎం.ఎస్.పీ లను నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలని,గన్నవరం మెట్ట ప్రాంతంతో సహా కృష్ణాజిల్లా మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకువచ్చే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని, సమగ్ర ప్రభుత్వ రంగ పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశం అనంతరం మహా ధర్నా ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల సి.పి.ఐ నాయకులు బండారు లక్ష్మయ్య, కటేవరపు మోహనరావు, ఎన్. రామ్మోహనరావు, వెంగళ రంగారావు,చాగంటి పాటి వెంకటేశ్వరరావు, వెంగళ శివయ్య,మండల టి.డి.పి నాయకులు బోడపాటి రవికుమార్, జాస్తి మురళి, ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, మండల సిపిఎం నాయకులు సూరగాని సాంబశివరావు, మిరపా నాగేశ్వరరావు, మల్లంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసన.
Leave a comment
Leave a comment