సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ పెట్టే మంటలు మామూలుగా ఉండవు. తన పాటికి తాను ఏదో ఒక కొటేషన్ పెట్టేస్తుంది. దాంట్లోని మీనింగ్ జనాలే అర్థం చేసుకోవాలి.. ఎవరిని ఉద్దేశించి ఆ కొటేషన్ చేసిందో కూడా జనాలే ఊహించుకోవాలి. ఇక పొలిటికల్‌గా ఆమె వేసే ఇలాంటి ట్వీట్ల మీద ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండి పడుతుంటారు. తాజాగా పూనమ్ కౌర్ మరో ట్వీట్ వేసి పొలిటికల్‌గా మంటలు పెట్టింది. నాయకుడు మహిళలకు ఇచ్చే గౌరవాన్ని చూస్తే.. వారి ఫాలోవర్స్ కూడా గౌరవాన్ని ఇస్తారు.. లీడర్ అంటే బాధ్యతలు మోసేవాడు.. తనని తాను ఉన్నతంగా, గొప్పవాడిగా చూపించుకునేవాడు కాదు.. ప్రతీ రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు అంటూ ట్వీట్ వేసింది.ఎప్పుడూ ఇలానే ఒకరి మీద ఏడుస్తూనే ఉండు..సినిమాలు లేవు.. సీరియల్స్ లేవు.. అందుకే ఇండస్ట్రీ నుంచి తరిమికొట్టి మంచి పని చేశారు అని ఓ నెటిజన్ కాస్త పరుషంగా స్పందించాడు.ఇలా పూనమ్ కౌర్ పరోక్షంగా వేసే ట్వీట్ల వల్ల నెటిజన్లు రెండు వర్గాలుగా చీలి ట్రోలింగ్లు చేసుకుంటున్నారు. పూనమ్ ఇలా పరోక్షంగా ట్వీట్లు వేయడం ఎప్పుడు ఆపుతుందో అంటున్నారు నెటిజన్లు .