అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. మసాచుసెట్స్ పంది కిడ్నీని ట్రాన్స్‌ప్లాంట్ చేసిన రిచర్డ్ స్లేమాన్ (62) మరణించారు. ఇంగ్లాండ్ వేమౌత్ నగరానికి చెందిన రిచర్డ్ స్లేమాన్ (62) కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే 2018లో వైద్యులు అతనికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. కొంత కాలం బాగున్నా.. ఆ తర్వాత కిడ్నీ సమస్య మొదటికి రావడంతో ఈ ఏడాది మార్చి 16న అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులు నాలుగు గంటల శ్రమించి స్లేమాన్‌కు పంది కిడ్నీని అమర్చారు. ఆపరేషన్ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ తరుణంలో ఏప్రిల్ 11న (నిన్న) స్లేమాన్ మరణించినట్లు కుటుంబసభ్యులు, మసాచుసెట్స్ వైద్యులు తెలిపారు.పందికిడ్నీని అమర్చడం వల్లే స్లేమాన్ మరణించినట్లు ఆధారాలు లేవని వైద్యులు వెల్లడిరచారు.