జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకి పురోహుతిక అమ్మవారి ఆలయం మూసివేస్తారు. ఈ నేపథ్యంలో దర్శన సమయాన్ని సాయంత్రం 4కి మార్చుకున్నారు. ఆదివారం ఉదయం పిఠాపురం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హెలికాప్టర్ దిగగానే ఆలయానికి బదులు మాజీ ఎమ్మెల్యే.. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వర్మ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వక భేటీ కానున్నారు. అనంతరం హోటల్‌కు వెళ్లి బస చేయనున్నారు.ఇంతకు ముందు నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమైతే.. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు, రామాలయం సెంటర్లో వారాహి విజయభేరీ బహిరంగసభ నిర్వహించాల్సి ఉంది కానీ ఆలయం మూసివేత కారణంగా పవన్ తన పర్యటన మొత్తాన్ని మార్పులు చేసుకున్నారు.