పిఠాపురం.. ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హట్ టాపిక్.. రాజకీయమంతా పిఠాపురం చుట్టూ తిరుగుతోంది. కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటమే. పిఠాపురం నియోజకవర్గంలో 2లక్షల 36వేల 602 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపులు 32 శాతం మంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టిబలిజలు 9.7 శాతం మంది. ఇతర బీసీ కులాలు 11 శాతం మంది. ఎస్సీ, ఎస్టీలు 3 శాతం మంది. క్షత్రియులు 2శాతం. 14 మంది ఎమ్మెల్యేలుగా పని చేస్తే 12 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంతోమంది పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహించినా.. నియోజకవర్గం అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. కాపులు 32 శాతం ఉండడంతో పవన్ గెలుపు సామాన్యం… లక్ష ఓట్లు మెజారీటీ రావాలన్నదే లక్ష్యం.