నటుడు నితిన్‌కి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నితిన్ ని ఎన్నో సార్లు అభినందించారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నితిన్ తాను చేయబోయి ఒక కొత్త సినిమాకి ఏకంగా తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సినిమా ‘తమ్ముడు’ 1999 లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు నితిన్ ఆ టైటిల్‌నే తన సినిమాకి పెట్టుకోవడం ఆసక్తికరంగా వుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా నితిన్ కథానాయకుడిగా రాబోయే సినిమాకి ‘తమ్ముడు’ అని టైటిల్ పెట్టారు. ఈరోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మొదటి చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది అని చెపుతున్నారు.ఈ చిత్రం టైటిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అనే చెప్పాలి. ఎందుకంటే పోస్టర్‌ను గమనిస్తే ఓ బస్సు మీద చిన్నిపాటి గడ్డంతో నితిన్ కూర్చుని ఉన్నారు.బస్సును ఓ మహిళ డ్రైవ్ చేయడం ఆసక్తిగా మారింది.