బ్రిటన్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన పలువురు భారతీయ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 29 మంది భారత సంతతి వారు యూకేలో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వీరిలో జన్మతః హిందువులైన మాజీ ప్రధాని రిషి సునాక్‌తో పాటు శివానీ రాజా, కనిష్క నారాయణ్‌లు భగవద్గీతపై ప్రమాణం చేశారు. శివానీ..గుజరాత్ నుంచి వెళ్లి బ్రిటన్‌లో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గత వారం ఎన్నికల్లో ఈమె కన్జర్వేటివ్ పార్టీ నుంచి గెలిచారు. యూకేలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. కనిష్క.. అధికార లేబర్ పార్టీ తరఫున తొలిసారిగా వేల్ ఆఫ్ గ్లామెర్గాన్ నుంచి నెగ్గారు. వేల్స్ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారత సంతతి ఎంపీ ఈయన. దేశాలు మారిన పుట్టిన గడ్డను, అక్కడి సాంప్రాదాయాలను మరచపోలేము అనడానికి ఇదొక ఉదాహరణ.