అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ అసమర్థపాలనకు ఇంకెంతమంది బలికావాలన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి వేలకోట్ల ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ కొత్త బస్సుల కొనుగోలు, నిర్వహణపై లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండులో బస్సు ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లి ముగ్గురు అమాయకులు బలైన దుర్ఘటన మరువకముందే.. తాజాగా భీమవరం సమీపంలోని వీరవాసరంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాజా శ్రీనివాసరావు (52) అనే ధాన్యం వ్యాపారిని ఢీ కొనడంతో మృతి చెందాడన్నారు. ప్రమాదానికి గురైన బస్సు బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు డ్రైవర్లు ముందుగా చెప్పినా… స్పేర్ పార్టులకు డబ్బుల్లేవని మరమ్మతులతో సరిపెట్టిన దివాలాకోరు ప్రభుత్వమని దుయ్యబట్టారు.
మెయింటినెన్స్ లోపం కారణంగా ప్రమాదం సంభవించినట్లు స్పష్టమవుతున్నందున ఇది ఖచ్చితంగా సర్కారీ హత్యేనన్నారు. మృతుడి కుటుంబానికి సరైన పరిహారం అందజేసి, ఇకనైనా దున్నపోతు ప్రభుత్వం కళ్లుతెరచి ఆర్టీసీ గ్యారేజిల్లో మెయింటినెన్స్కు నిధులు విడుదల చేయాల్సిందిగా కోరుతున్నానని నారా లోకేష్ అన్నారు.
అసమర్థపాలనకు ఇంకెంతమంది బలి కావాలి
Leave a comment
Leave a comment