కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైన సరే కూటమి స్ఫూరిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదని సోషల్ మీడియాకు నాగబాబు తీవ్ర హెచ్చరిక చేశారు. ఇప్పటికే ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టాం.జనసేన-టిడిపి-బిజెపి కూటమి స్పిరిట్‌ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖశ్చితంగా తగిన కఠిన చర్యలు ఉంటాయి.వైసిపి ఇంకా పూర్తిగా చావలేదు, ఇంక బతికే వుంది. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలివి. వాటినెవ్వరు పట్టించుకోకండి.కూటమికి సంబంధించిన మూడు పార్టీల అధినేతలు సమిష్టి, నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఇలాంటి పిచ్చి రాతలు మానుకోపోతే వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తాం అంటూ నాగబాబు తీవ్ర హెచ్చరిక చేశారు.