ప్రస్తుతం ఆహారం దొరక్కపోవడం, అడవులు నరికేస్తుండడంతో కోతులు ఆహారం కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. ఇళ్లలోకి వచ్చేసి చేతికి అందినవి పట్టుకుపోతున్నాయి. ప్రస్తుతం ఓ వీడియోలో ఓ కోతి అలాగే చేసింది. ఆ కోతి తీసుకెళ్లిన తన కళ్లజోడును తిరిగి తీసుకోనేందుకు ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని మధురలో ఓ కోతి కళ్లజోడుని పట్టుకుని ఆలయం పైకి వెళ్లిపోయింది. ఎంత మంది బతిమాలినా ఆ కోతి స్పందించలేదు. ముందు వాటర్ బాటిల్ విసిరితే, దానినే కిందకు విసిరేసింది. ఆ తర్వాత యాపిల్ విసిరినా ఆ కళ్లజోడు ఇవ్వలేదు. చివరకు ఫ్రూటీ ఇస్తే.. అప్పుడు ఆ కళ్లజోడును కిందకు విసిరింది.