వికసిత్ భారత్ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెటాడు. ఇండియా టీవీ సలాం ఇండియా షోలో మోదీ మాట్లాడారు. దేవుడు తననో ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తోందన్నారు. దేవుడు తనకు దారిచూపించడమే కాకుండా శక్తినిచ్చాడని, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడని విశ్వాసం ఉందని చెప్పారు. ఈ భూమ్మీద ఇంకా తాను ఎక్కాల్సిన మెట్లేవీ లేవన్నారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న మోదీ ఈ వ్యాఖ్యల ద్వారా మరో రెండు దశాబ్దాలు దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.