మోడీ ఎన్నికల బియ్యం ఏమిటా అని అలోచిస్తున్నారా.. నిజమే మన ప్రధానికి బియ్యం ధరలు బారీగా పెరిగిపోయాయని సడన్‌గా గుర్తుకొచ్చిందట.. అందుకే భారత్ రైస్ పేరుతో రూ. 29లకే 5, 10 కేజీల బ్యాగ్‌ల్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. వచ్చేది ఎన్నికల కాలం కదండీ.. ఇలాంటివి చాలా వస్తాయి అంటున్నారు మేధావులు. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా శుక్రవారం వెల్లడిరచారు. ఇప్పటికే భారత్ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్ దాల్ (శనగ పప్పు)ను రూ.60 చొప్పున కేంద్రం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. మార్కెట్లో టీ కూడా రూ. 30 అయిపోయింది. చివరిగా మన చాయ్ వాలా పీఎం భారత్ చాయ్ అని టీని కూడా ప్రవేశపెడతారేమో చూడాలి.