మంగళగిరి వెట్రన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాజీ సైనికులకు అందిస్తున్న సేవలు అభినందనీయం అని మాజీ మేజర్, మాజీ గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి వి.ఆర్.కే.చారి అన్నారు.గత రెండు రోజుల క్రితం మంగళగిరి వెట్రన్స్ ఆర్గనైజేషన్ కార్యాలయం ను సందర్శించి సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం గౌరవ అధ్యక్షులు గోవిందరావు, అధ్యక్షులు శంకర రెడ్డి గార్లతో చర్చించి కార్యలయం లో మెరుగైన సేవలు అందించేందుకు తనవంతు సహరకం అందిస్తానని తెలిపారు.చెప్పిందే తడువుగా రూ.13,500/- విలువ గల కేనాన్ ప్రింటర్, రూ.1500/- విలువగల వెబ్ కెమెరా అందించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు కే.గోవిందరావు, అధ్యక్షులు జి.శంకర రెడ్డి మేజర్ చారికి మంగళగిరి వెట్రన్స్ ఆర్గనైజేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.