ఉచితంగా మందు పంపిణీ చేస్తే.. మందుబాబుల ఆనందానికి హద్దు ఉంటుందా. కర్ణాటకలో బీజేపీ ఎంపీ మద్దతుదారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉచితంగా ‘మద్యం’ పంపిణీ చేయడం చర్చనీయాంశమయింది. దీనికి భారీ సంఖ్యలో ముందుప్రియులు క్యూ కట్టగా.. పోలీసులే బందోబస్తు నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీపౖౖె డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈవ్యవహారంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, భాజపా నేత కె.సుధాకర్ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపుర్ నుంచి విజయం సాధించారు. ఈ సందర్భంగా స్థానికంగా కృతజ్ఞత కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆయన మద్దతుదారులు.. ఉచితంగా మద్యం పంపిణీ చేపట్టారు. దీనికి జనం ఎగబడ్డారు.ఆ తతంగాన్నంతా పోలీసులు పర్యవేక్షించారు. దీనిపై జేపీ నడ్డా స్పష్టతనివ్వాలని శివకుమార్ డిమాిండ్ చేశారు.