లోకేష్ ప్రజా దర్బార్ నిర్విరామంగా జరుగుతోంది. ప్రజ సమస్యలు వెల్లువెత్తుతున్నాయి.. పరిష్కారం కూడా అదేస్థాయిలో సాగడంతో మంచి స్పందన వచ్చింది. అయితే టెక్నికల్ ప్ల్రాబ్లం కారణంగా లోకేష్ వాట్సాప్ బ్లాక్ అవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ బ్లాక్ అయిన విషయాన్ని స్వయంగా లోకేశ్ తెలియజేశారు. సమస్యల గురించి ప్రజలు తన పర్సనల్ మెయిల్‌కు పంపాలని కోరారు. ఆ మెయిల్ తానే చూసి పరిష్కరిస్తానని ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ పనిచేయక పోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఏం జరిగిందని టెన్షన్ పడ్డారు. వాట్సాప్ బ్లాక్ అయ్యిందని స్వయంగా లోకేశ్ ప్రకటన చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.