ఒక మంచి పని చేయడానికి ఎన్ని అడ్డంకులు ఉన్నా దాన్ని సుసాధ్యం చేసి విద్యార్థుల మనసు దోచుకున్నారు మంత్రి లోకేష్.. అదేమిటో చూద్దాం.. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన జీవో 225 విడుదల చేయడంతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగులకు మేలు చేకూరింది. ఆ జీవో వల్ల ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు సాధించారు. దీంతో వారంతా తల్లిదండ్రులతో కలిసి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేశ్ నివాసానికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి లోకేశ్ అభినందించడంతోపాటు వారికి ల్యాప్టాప్లను బహుకరించారు. ‘సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్’ విధానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ తెలిపారు.