టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ రియల్ చిత్రాలు ఏపీ రాజకీయాల్లోని ఎన్నో నిజాలను బయట పెట్టబోతున్నట్లు ఆర్జీవీ చెప్పుకొచ్చారు.ఈ సినిమాలోని సన్నివేశాలను చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా తెరకెక్కించారని నారా లోకేశ్ హైకోర్టులో కేసు వేయడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలే ఈ మూవీ రిలీజ్ కి కోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘వ్యూహం’ని ఫిబ్రవరి 23న, ‘శపథం’ని మార్చి 1న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.ఇక రేపు వ్యూహం రిలీజ్ కాబోతుంది అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు మళ్ళీ పోస్టుపోన్ చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. వ్యూహం సినిమాని మార్చి 1న, శపథం మూవీని మార్చి 8న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.