స్నేహితుడిని సరదాగా ఏప్రిల్ ఫూల్ చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడి కథ విషాదాంతమైంది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రాంక్ చేద్దామనుకుని.. ఊహించనివిధంగా అదే ఉరి కొయ్యకు వేలాడి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందౌర్కు చెందిన ఓ యువకుడు తన స్నేహితుడిని ఏప్రిల్ ఫూల్ చేద్దామని భావించాడు. ఈ క్రమంలోనే తన ఇంట్లో ఉన్న ఉరితాడుని మెడకు బిగించుకుని.. మిత్రుడికి వీడియో కాల్ చేసి, ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. అంతలోనే అతడు నిల్చొని ఉన్న కుర్చీ ప్రమాదవశాత్తూ పక్కకు పడిపోయింది. దీంతో ఉరి బిగుసుకుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.