హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో శుక్రవారం అర్ధరాత్రి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య.. అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది. లావణ్య తరఫు న్యాయవాది అర్ధరాత్రి పోలీసులు, మీడియాకు సమాచారం అందించారు. దీంతో నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు. రాజ్ తరుణ్ లేని ప్రపంచంలో తాను ఉండలేను.. అతడు మారిపోయాడు..తన చావును కోరుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికి మాల్వీనే కారణం..అయితే పోలీసులకు సూసైడ్ లెటర్ పంపిన కాసేపటికే తన అడ్వకేట్తో లావణ్య చాట్ చేసింది. తాను వెళ్లిపోతున్నానని అంటూ మెసేజ్ పెట్టడంతో అడ్వకేట్ పోలీసులకు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన పోలీసులు లావణ్యను కాపాడారు.