కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. టెస్టుల్లోనూ టీమ్ఇండియా ఛాంపియన్‌గా నిలవాలని అన్నాడు. ‘‘తెల్లబంతితో ఆ మూడూ మనం సాధించాం. ఇక ఎరుపే ఉంది. అది కూడా సాధించండి’’ అని డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లితో ద్రవిడ్ చెప్పాడు. ఈ వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.ద్రవిడ్ దృష్టిలో మూడు అంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మూడు ప్రపంచ ట్రోఫీలు అన్నమాట. ఒకటి టీ20 ప్రపంచకప్, రెండోది వన్డే ప్రపంచకప్.. మూడోది ఛాంపియన్స్ ట్రోఫీ. ఆటగాడిగా కోహ్లి ఈ మూడూ గెలిచాడు. ఇక మిగిలింది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్పే. టీమ్ఇండియా ప్రస్తుతం తుపాను కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. జట్టు ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నట్లు సమాచారం.