‘మా ఊళ్లో ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ సర్వసాధారణంగా మారింది. దీన్ని అడ్డుకోవాలనే ఏజెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నా’ అని సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ సోమవారం వైకాపా వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పల్నాడు జిల్లా రెంటాలకు చెందిన చేరెడ్డి మంజుల తెలిపారు. గొడ్డలి వేటు పడి నుదుటిపై తీవ్ర గాయమైనా.. ఒకవైపు నెత్తురోడుతున్నా ఆమె ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఏజెంట్గా కూర్చొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. మా రెంటాల గ్రామంలో ఎన్నికలు అంటే రాళ్లు, మారణాయుధాలతో దాడులు చేసుకోవటం, రిగ్గింగ్ ప్రతి ఎన్నికల్లో పరిపాటిగా మారింది. ఆ పరిస్థితి మారాలని, సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి గ్రామానికి చేరుకున్నా. ఆ విషయం ప్రత్యర్థులకు తెలిసింది. రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదు.