కావ్యా మారన్ అనగానే ఐపీఎల్లో భాగంగా అందరికీ ఉప్పల్లో జరిగిన మ్యాచ్ గుర్తుకు వస్తుంది. కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఐపీఎల్లోనే 277 రికార్డు స్థాయి స్కోరును సాధించడమే కాదు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్ సిక్సర్లు బాదినప్పుడల్లా ఆనందంతో ఆమె చేసిన హావభావాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీనిపై వారు ‘‘ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న మహిళ ఆమె’’ అని, కావ్యా మారన్ సంతోషానికి అవధుల్లేవు, ఈ సీజన్ మొత్తం ఇలానే నవ్వుతూ ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం.