ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో అభివృద్ధి చెందిన దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలు పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నాయని, ఈవీఎంలను వాడడం లేదని జగన్ అన్నారు. ‘మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటిచెబుతూ మనం కూడా పేపర్ బ్యాలెట్స్ దిశగా అడుగులు వేయాలి’ అని మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. కాగా జగన్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగానే టీడీపీ, జనసేన కౌంటర్ ఇచ్చాయి.‘‘ జరిగిన న్యాయం కనిపించాలని ఏవిధంగానైతే కోరుకుంటామో.. అలాగే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి’’ అని వారు వ్యాఖ్యానించడం విశేషం