ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలవడంపై హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఏం పగులగొట్టి మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్తే ఆయన్ను పరామర్శ చేయడానికి జగన్ రూ.25 లక్షలు ఖర్చు పెట్టి మరీ వెళ్ళారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చాక జైల్లో ఉన్న పిన్నెల్లిని హెలికాఫ్టర్‌లో వెళ్లి మరీ పరామర్శించారన్నారు.ములాఖత్‌లు ముగిసిన తర్వాత కూడా మానవతా ధృక్పధంతో జగన్‌కు అనుమతి ఇచ్చామన్ని చెప్పుకొచ్చారు. అనుమతి వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా జగన్ వెళ్లారంటే గొడవ పెట్టుకోవడానికే అని మండిపడ్డారు.