సీఎం జగన్మోహన్రెడ్డి విదేశాలకు వెళ్లిన దగ్గర నుంచి ఇండియాకు జగన్ ఇక రాడు అంటూ పలు మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాయి. కాని అనుకున్న ప్రకారం కోర్టు అనుమతి ప్రకారం 1వ తదీన ఇండియాకు తిరిది వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున,కొట్టు సత్యనారాయణ పుష్పగుచ్చములిచ్చి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్ కుమార్ , ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు విమానాశ్రయానికి వచ్చారు.