ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దర్యాప్తు బృందానికి భుజంగరావు కీలక విషయాలు వెల్లడిరచారు. ‘‘భారాసకు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్ చేశాం. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో ట్యాపింగ్ చేశాం. భాజపా, కాంగ్రెస్‌లకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు , భారాసలో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశాం. విపక్ష నేతలు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం’’ అని భుజంగరావు సంచలన విషయాలు వెల్లడిరచారు. ‘‘విపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలు ట్రాక్ చేశాం. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశాం. మూడు ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేశాం. ఇలా ఒకటేమిటీ ప్రభుత్వానికి వ్యతిరేక స్వరం వినిపించే వారిని ఎవరినీ వదలలేదు.. భుజంగరావు వెల్లడిరచిన వివరాలతో బీఆర్ఎస్ పునాదులు కదిలాయి.. కేసీఆర్‌కు జైలు తప్పదంటున్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.