గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గురువారం తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్మెన్లు వైద్యులకు సమాచారం అందించారు. ప్రధమ చికిత్స అనంతరం కొడాలి నానికి.. వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. నాని.. అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు కొడాలి కుటుంబ సభ్యులు బయల్దేరారు. అతిగా ఆలోచించాల్సిన అవసరం ఆయనకేంటి..? ఎన్నికల ఫలితాలపై ఆలోచిస్తున్నారా..? లేకుంటే మరేమైనా జరిగిందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.