మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసించారు. అలాగే ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) సంస్థనూ ఆమె అభినందించారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. ‘డబ్ల్యూసీసీ గురించి నాకు చాలా కాలంగా తెలుసు. ప్రభుత్వం హేమ కమిటీ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ తీసుకొన్న చొరవే కారణం. వారి పోరాటానికి నా కృతజ్ఞతలు’ అని తెలిపిన సమంత.. తాజాగా టాలీవుడ్లోనూ కదలిక తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అంటే ఒక రకంగా పోరాటానికి సిద్ధమవుతోందని చెప్పుకోవచ్చు. కానీ టాలీవుడ్ కు సంబంధించి ఏ ఒక్కరూ ఇంత వరకు బయటికి రాలేదు. అలాంటి వారందరి తరపున సమంత నిలబడాలని చూస్తుందేమో తెలియదు కానీ.. తాజాగా ఆమె ఇన్స్టా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది.