ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా మంది రీల్స్ పిచ్చిలో పడి ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో తమ ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. తాజాగా, రీల్స్ కోసం ఓ యువతి చేసిన రిస్క్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు ప్రమాదకర విన్యాసం చేసేందుకు సిద్ధమైంది. నీళ్లు ఉదృతంగా ప్రవహిస్తున్న డ్యామ్ వద్దకు వెళ్లిన ఆమె.. చివరకు వినూత్న విన్యాసం చేసింది. డ్యామ్ గోడపై నిలబడ్డ ఆమె.. నీటిపై బోర్లా పడుకుని డ్యామ్ కిందకు జారింది. ఇలా డ్యామ్ గోడపై ఏటవాలుగా జారుకుంటూ చివరకు నీటిలోనే మునిగిపోయింది.ఎంత సేపటికీ నీటి పైకి రాలేదు. ఈ వీడియో ఇంతటితో ముగుసింది. ఈ వీడియో చూసిన వారంతా.. తర్వాత ఏం జరిగిందో అనే ఆందోళనలో ఉన్నారు. ఇంతకీ ఆ యువతికి ఏమైందీ.. క్షేమంగానే ఉందా.. అంటూ చర్చించుకుంటున్నారు.