ప్రజలు పరిపాలించమని అధికారం ఇస్తే.. రాష్ట్రంలో గంజాయిని పెంచాడు. మద్యం, డ్రగ్స్ మాఫియాను తయారుచేశాడు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు, అరకులోయ, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటల్లో శనివారం ఏపీ న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు.చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేస్తానని భ్రమరావతి చేస్తే, జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు అంటూ రాష్ట్ర ప్రజల చేతిలో చిప్పపెట్టి రాజధానే లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా మన బిడ్డలకు, రాష్ట్రానికి ఊపిరిలాంటిదని ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.