పిన్నెల్లికి బెయిల్ వస్తే.. పోలీసులకు సంతోషం ఎందుకు అనుకుంటున్నారా.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు బయలుదేరిన పోలీసుల కష్టాలు అన్నీఇన్నీ కావు. అరెస్టు చేస్తే ఏమవుతుంది.. చేయకపోతే వస్తున్న విమర్శల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిన్నెల్లిని అరెస్టు చేయవద్దు అన్న కోర్టు తీర్పు పోలీసులకు సంతోషాన్నిచ్చింది అనడంలో సందేహం లేదు. హైకోర్టు… ఆయనపై జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఆదేశించింది. పోలీసులకు కావలసిందీ అదే..! హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే… పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి..! ఎమ్మెల్యేను అరెస్టు చేయకుండా రకరకాల డ్రామాలతో నెట్టుకొస్తున్న పోలీసులకు ఇది నిజంగా ఊరటే..!