ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నడుస్తున్న విషయాలు రెండే రెండు. ఒకటి నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలైతే.. రెండోది మెగా-అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య వార్. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో ఓ భారీ వేడుకను నిర్వహించేందుకు టాలీవుడ్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులనే కాకుండా.. ఇతర సినీ ఇండస్ట్రీల వారికి కూడా ఆహ్వానాలను పంపుతున్నారు. తాజాగా ఈ ఆహ్వానం అల్లు అర్జున్‌కు కూడా చేరింది. ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ సానుకూలంగా స్పందిస్తూ.. బాలకృష్ణతో తనకి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నట్లుగా సమాచారం. అయితే.. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా మెగా-అల్లు ఫ్యామిలీల ఫ్యాన్స్ మధ్య పెద్ద దుమారమే చెలరేగుతుంది. మెగాస్టార్ చిరంజీవి వస్తున్న ఈ వేడుకకు అల్లు అర్జున్ వెళతాడా? అనేది అనుమానంగా మారింది. ఒకవేళ వెళ్లి.. ఆప్యాయంగా చిరు, అల్లు అర్జున్ మాట్లాడుకునే సందర్భం కనుక వస్తే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న యుద్ధవాతావరణానికి ఫుల్ స్టాప్ పడినట్లే. ఏం జరగనుందో.. చూద్దాం.