ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప లోక్ సభలో ప్రత్యర్థి అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసిన వారితో సంబంధాలు ఎందుకు ఉన్నాయని సూటిగా అడిగారు. హత్య జరిగిన సమయంలో చేసిన కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ప్రమేయం లేకుంటే.. సీబీఐ విచారణ అంటే ఎందుకు జంకారని అడిగారు. తనను వ్యక్తిగతంగా దూషించారని షర్మిల వాపోయారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జన్మించలేదట..? తన సోదరి సునీతా రెడ్డి వివేకానందను హత్య చేయించిందని నిందలు మోపారు. మీరు చెబుతోన్న అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారని షర్మిల గుర్తుచేశారు హంతకులను చట్టసభలకు పంపించొద్దని, అందుకోసమే తాను కడప లోక్ సభ నుంచి బరిలోకి దిగానని షర్మిల వెల్లడిరచారు.