బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయంటారు ఇదేనేమో.. నిన్నటి వరకు మహారాజులా ఒక వెలుగు వెలిగిన మాజీ సీఎం జగన్ ఇలా అయిపోతారని ఎవరూ ఊహించలేదు. ఎక్కడకు వెళ్లినా ఎదురు దెబ్బలే.. కనీసం తన సొంత ఊరు పులివెందుల్లో కూడా వ్యతిరేకత ఏర్పడిరది. ఇప్పుడు తాజాగా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ స్పీకర్‌కు లేఖ రాయడం విడ్డూరంగా ఉంది.అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. లేదంటే సభకు వచ్చి ఉపయోగం ఉండదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీలో 11 స్థానాలే దక్కాయి. సభలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా, జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లభించాలంటే సీట్లలో కనీసం పది శాతం ఉండాలి. 18 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ ఏడు స్థానాలు తగ్గాయి. దీంతో స్పీకర్ ఆయన్ను సభలో వైసీపీ శాసనసభాపక్ష నేతగా గుర్తిస్తారు తప్ప.. ప్రతిపక్ష నేతగా గుర్తించే వీలు లేకుండా పోయింది.