ప్రస్తుత సోషల్ మీడియాలో వృత్తి విషయంలో పోటా పోటీ ఎలా ఉన్నా.. రీల్స్ చేసే విషయంలో మాత్రం నిత్యం పోటీ నడుస్తూనే ఉంటుంది. ఒకరిని మించి మరొకరు వినూత్నంగా రీల్స్ చేసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు కొండ ప్రాంతాల్లో వినూత్నంగా రీల్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఇందుకోసం అందమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. కొండ పైనుంచి లోయలోకి దిగి అందమైన స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తే వైరల్ అయిపోవచ్చని భావించాడు. ఇందుకోసం కొండ పైనుంచి లోయలోకి దిగి కెమెరాకు ఫోజులు ఇస్తూ కాసేపు వెనక్కు నడుస్తూ స్టెప్పులు వేశాడు. అంతే బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో లోయ ఏటవాలు కారణంగా కంట్రోల్ కాలేక వేగంగా కిందకు వెళ్లిపోయాడు. చూస్తుంటే ఈ ఘటనలో అతడికి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. ‘‘రీల్స్ పిచ్చి ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.