మాజీ ప్రియురాలిపై రెండేళ్ల క్రితం హత్యాయత్నం చేసినందుకు భారత దేశానికి చెందిన శ్రీరాం అంబర్ల (25)కు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ లండన్‌లోని ఓల్డ్ బెయిలీ కోర్టు తీర్పు చెప్పింది. రెస్టారెంట్లో ఉండగా ఆమెను కత్తితో పొడిచినట్టు రుజువు కావడంతో ఈ శిక్ష వేసింది. శ్రీరాంకు, 20ల్లో ఉన్న కేరళ యువతికి హైదరాబాద్‌లో పరిచయం ఏర్పడిరది. 2019లో వారు విడిపోయారు. 2022లో ఇద్దరూ ఈస్ట్ లండన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువుల నిమిత్తం చేరారు. అదే సమయంలో ఆమె ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైం వెయిట్రెస్‌గా పనిచేయడం ప్రారంభించింది. మళ్లీ ఎదురుపడ్డ నుంచి ఆమెను బెదిరించడం, కొట్టడం ప్రారంభించాడు.2022 మార్చిలో ఈస్ట్ లండన్‌లోని హైదరాబాదీ రెస్టారెంట్లో ఉండగా ఆమెను కత్తితో పొడిచాడు. నేరం అంగీకరించడంతో ఈ శిక్ష విధించింది.