వైసీపీ పాలనలో శిథిలావస్థకు చేరిన అన్న క్యాంటీన్లు కొత్త హంగులతో సిద్ధమవుతున్నాయి. పేదల ఆకలి బాధలు తీర్చే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు తక్షణం రూ.189.22కోట్లు అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అంచనాలు వేసింది. ఆర్థికశాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో 183 క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.189.22 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనాలు వేసి ఆర్థికశాఖకు నిధుల కోసం ప్రతిపాదించారు.