ఆ పాఠశాల ఉపాధ్యాయులకు కొత్త ఆలోచన వచ్చింది. హోలీ జరుపుకోవాలి.. కాని రంగులు వాడకూడదు.. అందుకే టమోటాలతో హోలీ ఆడుకుందాం అంటూ వినూత్న విధానానికి తెరతీశారు.హోలీ పండగను పురస్కరించుకొని హనుమకొండలోని ఓ పాఠశాల రంగులు కాకుండా రూ.3 వేలు పెట్టి మార్కెట్లో మూడు క్వింటాళ్ల టమాటాను కొనుగోలు చేసింది. వాటిని కోమటిపల్లి ప్రాంతంలోని నిరూప్నగర్లో ఇలా కుప్పగా పోయడంతో ఒకరిపై ఒకరు విసురుకుంటూ పిల్లలు హోలీ చేసుకున్నారు..