కేదార్‌నాథ్‌లో ఇటీవల ఒక క్రెస్టల్ హెలికాప్టర్ ల్యాండిరగ్ సమయంలో దెబ్బతింది. దీనిని తరలించేందుకు సైన్యం రంగప్రవేశం చేసింది. ఆర్మీ ఎంఐ-17 ఛాపర్‌ను తెప్పించారు. దీనికి ప్రత్యేకమైన కేబుల్స్‌తో క్రెస్టల్ హెలికాప్టర్‌ను కట్టి తరలించారు. కొద్ది దూరం ప్రయాణించిన వెంటనే కేదార్నాథ్-గచౌర్ మధ్య భీంబాలి ప్రాంతంలో ఎంఐ-17 హెలికాప్టర్‌కు అమర్చిన తీగలు తెగిపోయాయి. కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్ హెలికాప్టర్ కొండపై పడిపోయింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అన్న విషయం మాత్రం తెలియరాలేదు.ఇటీవల ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను ఆగస్టులో నిలిపివేశారు. దీంతో యాత్రికులు వాయుమార్గంలో ఇక్కడికి వస్తున్నారు. ఈ క్రెస్టల్ హెలికాప్టర్‌ను యాత్రికులను తరలించేందుకు వినియోగంచేవారు. మరోవైపు వర్షాల కారణంగా గౌరీకుండ్-కేదార్‌నాథ్‌ల మధ్య చిక్కుకుపోయిన వేలాది మంది యాత్రికులను రక్షించేందుకు సైన్యం, వాయుసేన చినూక్, ఎంఐ-17 హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి.