బస్సులు, రైళ్లలో ప్రయాణికులు నిండుగా ఉన్నప్పుడు.. కూర్చోవడానికి సీటు లేక నిల్చొనే వెళ్తుంటారు. ఇది సర్వసాధారణం. కానీ.. విమానంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా? ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ 6543 విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ నుంచి వారణాసికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇండిగో ఉద్యోగి స్టాఫ్ లీజర్ ట్రావెల్లో భాగంగా ప్రయాణం చేసేందుకు విమానం ఎక్కాడు. ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం అందడంతో.. ఆ సీటుని ఇండిగో ఉద్యోగికి స్టాండ్‌బైగా ఇచ్చారు.తీరా ఫ్లైట్ ఎక్కిన తర్వాత చూస్తే.. ఆ సీటుని బుక్ చేసుకున్న ప్రయాణికుడు అప్పటికే విమానంలోనే ఉన్నాడు. దీంతో మరో దారి లేక.. నిలబడే ప్రయాణం చేయాలని ఇండిగో ఉద్యోగి నిర్ణయించుకున్నాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. విమానం నిలిపివేసి, అతడిని కిందకు దించేశారు. స్టాండ్‌బై పాసింజర్‌ను కిందకు దించేశామని, దీంతో టేకాఫ్‌కు ఆలస్యమైందని పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.