గూగుల్ మ్యాప్.. ప్రస్తుతకాలంలో ఇది అందరికీ దిక్సూచిలా మారింది. కానీ గూగుల్ మ్యాప్ అన్నివేళలా సరైనమార్గాన్నే సూచిస్తుందా అంటే చెప్పలేం. ఒక్కోసారి గూగుల్ మ్యాప్ అంచనాలు కూడా తప్పయ్యే అవకాశాలున్నాయి. తాజాగా గూగుల్ మ్యాప్ పెట్టుకొని విహారయాత్రకు వెళ్తున్న టూరిస్టులకు వింత అనుభవం ఎదురైంది. నీలగిరిజిల్లాలోని ఊటీ అందాలు చూడడానికి కర్నాటక వచ్చిన ఓ కుటుంబం తమిళనాడు విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో కొండ ప్రాంతమైన గూడలూరుకు కారులో వెళ్లారు. గూగుల్ మ్యాప్ చూపించిన దారిలోనే వెళ్లిన ఆ కారు.. నీలగిరి ప్రాంతంలోని ఇళ్ల మధ్యకు వెళ్లింది. అలా వెళ్లగా వెళ్లగా రోడ్డు పోయి మెట్ల మార్గం వచ్చింది. జనం నడుచుకుంటూ వెళ్లే మెట్ల మార్గంలోకి వెళ్లి ఆగిపోయింది. దాంతో అది ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేని పరిస్థితి ఏర్పడిరది. ఆ కారు డ్రైవర్ ఏం చేయలేక పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు, స్థానికులు.. ఎట్టకేలకు ఆ కారును సురక్షితంగా మెట్లమార్గంనుంచి కిందకి దించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.