ఇకపై విద్యార్థులు యూనివర్సిటీల వారీగా పీహెచ్డీ అడ్మిషన్ పరీక్షలకు హాజరవ్వకుండా జాతీయ అర్హత పరీక్ష (నెట్) స్కోర్‌తో ప్రవేశాలు పొందవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గురువారం పేర్కొంది. ఈ ఏడాది జూన్ సెషన్లో నిర్వహించే యూజీసీ-నెట్ పరీక్షలో కొత్త కేటగిరీని ప్రవేశపెట్టనున్నట్లు తెలి పింది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఏడాదిలో రెండుసార్లు నెట్ నిర్వహణ ఉంటుంది అని యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ తెలిపారు. తమ విశ్వవిద్యాలయంలో నెట్, జేఆర్ఎఫ్, తెలంగాణసెట్ను పీహెచ్డీ ప్రవేశాల్లో అర్హతగా పరిగణిస్తున్నామని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ వడ్డాణం శ్రీనివాసరావు తెలిపారు.