ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా విమానంలో ఎదురైన అనుభవంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ ఆ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణించను. దానికంటే ఎడ్లబండి నయం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య కొందవార్ అనే నెటిజన్ ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆయన బెంగళూరు నుంచి పుణెకు వెళ్లడానికి ఆ విమానం ఎక్కారు. జూన్ 24 రాత్రి 9.50 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం అర్ధరాత్రి 12.20 గంటలు దాటిన తర్వాత బయల్దేరింది. ఎక్కిన తర్వాత విమానమంతా ఒకటే వాసన. సీట్లు చాలా మురికిగా ఉన్నాయి. వాటి నిండా మరకలే. నాకు టాటా గ్రూప్‌పై అమితమైన గౌరవం ఉంది. అలాగే వారినుంచి ఎప్పుడూ నాణ్యమైన సేవలను ఆశిస్తాను. కానీ నిన్నటి ప్రయాణం మాత్రం భయానకం’’ అని పోస్టులో వెల్లడిరచారు.దీనిపై ఎయిరిండియా ‘‘ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం అని స్పందించింది.