‘గామి’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్న విష్వక్సేన్ నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించగా, సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం విడులైంది. మీడియా సమావేశంలో హీరో విష్వక్సేన్ మాట్లాడుతూ ‘‘అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం మాస్ ఆడియెన్స్‌ను మాత్రమే కాదు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. తెలుగులో ఇటువంటి ఫార్ములాతో ఇప్పటివరకు చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘‘గోదావరికి చెందిన లంకల రత్న అనే ఒక స్లమ్‌కు చెందిన కుర్రాడు.. రాజకీయాలను వాడుకుని ఎలా జీవితంలో ఎదిగాడు అనేది ఈ సినిమా కథ.