దేశ ఆర్థిక రాజధాని ముంబయికి విమానాలు క్యూ కడుతున్నాయి. తాజాగా ఇండిగో సంస్థ విజయవాడ నుంచి ముంబయికి సర్వీసును ప్రారంభించాలని నిర్ణయించింది. ఆగస్టు 16 నుంచి సర్వీసు షెడ్యూల్‌ను ప్రకటించింది. కొద్ది రోజుల కిందట ఎయిర్ ఇండియా ముంబయికి డైలీ ఫ్లైట్‌ను ప్రారంభించింది. ఇది విజయవంతంగా నడుస్తోంది. సగటున 90 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. వారాంతాలలో అయితే నూరు శాతం ఓఆర్ సాధిస్తోంది. ప్రయాణికుల నుంచి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇండిగో కూడా ముంబాయికి విమాన సర్వీసు నడపాలని నిర్ణయించింది. ప్రతి రోజూ రాత్రి 9 గంటలకు ఈ విమానం బయలుదేరి రాత్రి 11 గంటలకు ముంబయికి చేరుకుంటుంది. ప్రారంభోత్సవ ఆఫర్ ధరగా రూ.4,098 గా నిర్ణయించింది. విమానయాన సంస్థల మధ్య పోటీతో ఇప్పుడు ముంబయికి తక్కువ ధరకు ప్రయాణించే అవకాశం ఏర్పడిరది.