మొన్న సంక్రాంతికి..సినిమా రిలీజ్ డేట్ ల విషయంలో జరిగిన రచ్చ.. దిల్ రాజు వెనక పడిపోయాడు. చిరంజీవి సపోర్ట్ చేసిన హనుమాన్ అద్భుత విజయం సాధించింది. దీంతో ఇటువంటి పరిస్థితులు మల్ల రాకూడదని దిల్ రాజు కంకణం కట్టుకున్నాడు.. పాపం అది జరిగేలా లేదు… కదా.. మల్ల అలాంటి పరిస్థితి రిపీట్ అయ్యేలా ఉంది… సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర వస్తున్న నేపథ్యంలో.. తండ్రితో తనయుడు ఢీకొట్ట నున్నారా..? ఇలా జరగకుండా దిల్ రాజు ఏం చర్యలు తీసుకోనున్నాడు?పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర అక్టోబర్ 10 లాక్ చేసుకోగా అల్లు అర్జున్ పుష్ప-2 ఆగస్టు 15.. వస్తున్నట్లు ప్రకటన చేసేసారు.. ఇలా అందరూ మేము వస్తున్నాం తప్పుకోండి.. తప్పుకోండి.. అంటూ ముందుకు వెళ్తుంటే.. దానికి తగ్గట్లే చిన్న సినిమాలు… మిగిలిన సినిమాలు రిలీజ్ కి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు…!అసలు సమస్య శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ తోటే.. ఎందుకంటే.. పైన ప్రకటించిన సినిమాలు కంటే ఎప్పుడో మొదలైన.. షూటింగ్ నేటికీ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది.. సమాంతరంగా కమల్ హాసన్ ఇండియన్ టు.. ఒక్కసారిగా తెర మీదకు రావడం.. దిల్ రాజుకు మింగుడు పడటం లేదు… దీని ఇంపాక్ట్.. గేమ్ చేంజెస్ షూటింగ్ నత్త నడక నడుస్తూనే ఉంది… పాలనచోట పలానా టైంలో షూటింగ్ ఉందని అనౌన్స్ చేసుకోగలుగుతున్నారే తప్ప… ఇప్పటికే సాలిడ్ గా సినిమా రిలీజ్.. ఎప్పుడో చెప్పలేకపోవడం… సీనియర్ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత.. ఆయన దిల్ రాజుకు..పెద్ద సవాల్ గా మారింది.ఎందుకంటే.. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. వారి వారి సినిమాల డేట్లు ఇప్పటికే ప్రకటించేశారు… సంక్రాంతికి వద్దాం అనుకుంటే… చిరంజీవి విశ్వంభర ఉండనే ఉంది… చిరంజీవితో పోటీకి దిల్ రాజు వెళ్లడనుకుందాం.. ఒకవేళ వెళ్లినా.. తనయుడు రామ్ చరణ్ ఒప్పుకోడు…!ఈ సమీకరనాల దృష్ట్యా.. సెప్టెంబర్ కి వద్దామని గట్టిగా నిర్ణయించుకున్నాడు… కానీ పాపం శంకర్.. అనుమతి లేనిదే ప్రకటించలేని దుస్థితి.. ఈ కారణాల చేత కక్కలేక మింగలేక.. అన్నట్లు ఉంది మన దిల్ దార్… రాజు… పరిస్థితి…!సెప్టెంబర్ నెలలో గేమ్ చేజర్ వస్తుందో రాదో.. అని తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే..!