ఎంతటి పెద్దవారైనా చట్టానికి అతీతులు కాదు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ అను బంద సంస్థ లింక్డ్ఇన్ ఇండియా, మరో ఎనిమిది మంది వ్యక్తులపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. వీరు కంపెనీల చట్టం, 2013లోని 90వ సెక్షన్ను ఉల్లంఘించినందుకు రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్ ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ ఇండియా సీఈఓ ర్యాన్ రొస్లాన్స్కీలపై చెరో రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తున్నట్టు కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లింక్డ్ఇన్ ఇండి యా ఈక్విటీలో వీరికి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయోజన హక్కులు ఉన్నా, వారు ఆ విషయాన్ని వెల్లడిరచలేదని, అందుకు ఈ జరిమానా విధిస్తు న్నట్లు తెలిపింది. కనీసం కంపెనీల చట్టంలోని నిబంధన 2ఏ (2) కింద కూడా వీరు తమకు ఈ విషయం తెలియజేయకపోవడాన్ని కంపెనీ వ్యవహారాల శాఖ తప్పు పట్టింది.